కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ అజీవిక మిషన్' దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయం వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కుటుంబానికి ఉపాధి, ప్రతి వ్యక్తికి ఆత్మనిర్భర జీవనోపాధి అందిస్తామని తెలిపారు.