రాజమండ్రి సమీపంలోని బొమ్మూరులో ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు నిర్వహించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలు లక్ష్యంగా ఈ తనిఖీలు జరిగాయి. మైనర్లు వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. లైసెన్స్ లేకుండా నడిపేవారిపై, పత్రాలు సరిగా లేనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.