అడవుల నరికివేతతో పులులు మానవ ఆవాసాల్లోకి: గారా అజయ్ కుమార్

1051చూసినవారు
మన స్వార్థం కోసం అడవులను విచ్చలవిడిగా నరికివేయడం వల్ల జంతువులు తమ నివాసాలను కోల్పోయి మానవ ఆవాసాలకు వస్తున్నాయని, దీనిని సెన్సేషనల్ న్యూస్‌గా చూడటం సరికాదని మన బాధ్యత ఫౌండేషన్ ఫౌండర్ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ అన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పులి సంచారం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పులిని ఎవరూ చంపకుండా, అది కూడా ఎవరికీ హాని చేయకుండా అధికారులు దానిని త్వరగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టాలని ఆయన కోరారు. ప్రభుత్వం, ప్రజలు మేల్కొని అడవులను కాపాడుకోవాలని, ఈ భూమి మనిషికి మాత్రమే సొంతం కాదని, వనరులను ఉపయోగించుకోవాలి తప్ప నాశనం చేసే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్