ప్రత్యేక మహిళా కేంద్ర కారాగారాన్ని సందర్శించిన గాంధీబాబు

231చూసినవారు
ప్రత్యేక మహిళా కేంద్ర కారాగారాన్ని సందర్శించిన గాంధీబాబు
ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఉండవెల్లి గాంధీబాబు శుక్రవారం రాజమండ్రిలోని ప్రత్యేక మహిళా కేంద్ర కారాగారాన్ని సందర్శించి, అక్కడ అమలవుతున్న సంక్షేమ, పునరావాస కార్యక్రమాలను పరిశీలించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ టి. శ్రీదేవి కూడా ఆయనతో పాటు పాల్గొన్నారు. అనంతరం మహిళా ఖైదీలతో ముఖాముఖి సమావేశమై, వారికి అందిస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలపై ఆరా తీశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత స్వయం ఉపాధి సాధించేందుకు ఈ శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్