గాంధీ, శాస్త్రి జయంతి: ఎమ్మెల్సీ వీర్రాజు నివాళి, ఖాదీ సంతలో పాల్గొన్న వైనం

7చూసినవారు
గాంధీ, శాస్త్రి జయంతి: ఎమ్మెల్సీ వీర్రాజు నివాళి, ఖాదీ సంతలో పాల్గొన్న వైనం
రాజమండ్రి సిటీలో శుక్రవారం మహాత్మా గాంధీ 155వ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. గాంధీ స్వదేశీ భావన, శాస్త్రి "జై జవాన్ – జై కిసాన్" నినాదం దేశానికి ఆదర్శప్రాయమని వీర్రాజు అన్నారు. అనంతరం ఖాదీ సంతలో పాల్గొని, చేనేత కార్మికులను ప్రోత్సహిస్తామని, వారి సంక్షేమానికి అండగా ఉంటామని, స్వదేశీ, ఖాదీ ఉత్పత్తుల వినియోగంతో చేనేత రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్