రాజమండ్రిలోని గౌతమి సూపర్ బజార్‌లో అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన PGRSలో వైసీపీ శ్రేణులతో కలిసి వినతి పత్రం అందజేశారు. నగరంలో అక్రమ కట్టడాలపై హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, తక్షణమే అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని ఆయన కోరారు.