వైసీపీ వారి మద్యం షాపుల్లో అన్ని బ్రాండ్లపై అక్రమంగా వసూళ్లు

417చూసినవారు
వైసీపీ వారి మద్యం షాపుల్లో అన్ని బ్రాండ్లపై అక్రమంగా వసూళ్లు
రాజమండ్రి నగరంలోని వైసీపీ మద్యం షాపుల్లో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అన్ని రకాల మద్యం బ్రాండ్లపై అక్రమంగా రూ. 10 వసూలు చేస్తున్నారని నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆరోపించారు. ప్రభుత్వం కేవలం రూ. 99ల మద్యం బ్రాండ్లు, కొన్ని ఎంపిక చేసిన బ్రాండ్లపై మాత్రమే రూ. 10 వసూలు చేసుకోవచ్చని జీవో ఇచ్చిందని, అయితే వైసీపీ మద్యం షాపులు మాత్రం అన్ని బ్రాండ్లపై అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నాయని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్