రాజమండ్రి నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం రాజమండ్రిలోని 6వ డివిజన్ అన్నపూర్ణమ్మపేటలో 300 ఎం.ఎం. సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే వర్షాకాలంలో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగి ఉపశమనం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.