రౌడీషీట్లను కులానికి ఆపాదించడం సరికాదు

649చూసినవారు
రౌడీషీట్లను కులానికి ఆపాదించడం సరికాదు
ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు ఆదివారం రాజమండ్రిలో మాట్లాడుతూ, రౌడీషీట్లకు కులాన్ని ముడిపెట్టి సమాజాన్ని అపవాదుకు గురిచేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి శెట్టిబలిజ సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామని, గత ఏడాదిన్నర కాలంలో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. శెట్టిబలిజల జీవనోపాధిని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్