జనతా వారధితో ప్రజల సమస్యకు పరిష్కారం

506చూసినవారు
జనతా వారధితో ప్రజల సమస్యకు పరిష్కారం
రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి శుక్రవారం జనతా వారధి కార్యక్రమం నిర్వహించి, పోలీస్ సమస్యలతో పాటు వ్యక్తిగత, ఆరోగ్య, విద్యుత్, భూ సమస్యలు, గ్రామ అభివృద్ధి పనులపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జనత వారధి కన్వీనర్ శివరామరాజు, కో కన్వీనర్ యానాపు ఏసు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్