ఎమ్మెల్సీని కలిసిన కంబాల శ్రీనివాసరావు

5చూసినవారు
ఎమ్మెల్సీని కలిసిన కంబాల శ్రీనివాసరావు
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలోని ఎమ్మెల్సీ సోము వీర్రాజుని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ పట్ల ఆసక్తి చూపుతున్న పలువురు నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. తన ఆధ్వర్యంలో జగ్గంపేట, రంపచోడవరం, రాజానగరం నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని, ఆసక్తి ఉన్నవారికి పార్టీలో చేరేందుకు అవకాశం కల్పించాలని, కంబాల కోరారు.

సంబంధిత పోస్ట్