రక్తదానంతో ప్రాణాలు కాపాడదాం: గారా శ్రీవిద్య రాణి

281చూసినవారు
రక్తదానంతో ప్రాణాలు కాపాడదాం: గారా శ్రీవిద్య రాణి
మన బాధ్యత ఫౌండేషన్ రాజమండ్రి సిటీ అధ్యక్షురాలు గారా శ్రీవిద్య రాణి ఆధ్వర్యంలో సమ్మర్ బ్లడ్ డ్రైవ్ 100వ రోజుకు చేరుకుంది. ప్రజల్లో అవగాహన కల్పించి, రక్త కొరతను తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. యువత, ప్రజల మద్దతుతో కలిసి పనిచేసి ప్రాణాలు కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు. కేవలం 5 నిమిషాల రక్తదానం ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలదని, రక్తదానం అంటే ప్రాణదానమని ఆమె తెలిపారు. ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమం తూర్పు గోదావరి, రాజమండ్రి సిటీలో జరుగుతోంది.

సంబంధిత పోస్ట్