ప్రభుత్వ హామీతో జీవితాంతం రూ. 3, 000 పెన్షన్..!

674చూసినవారు
ప్రభుత్వ హామీతో జీవితాంతం రూ. 3, 000 పెన్షన్..!
అసంఘటిత రంగ కార్మికులు, చిన్న వ్యాపారులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత, స్థిర ఆదాయం అందించే లక్ష్యంతో ప్రభుత్వం PM-SYM, PM-LVM వంటి జాతీయ పెన్షన్ పథకాలను అమలు చేస్తోందని జిల్లా సహాయ కార్మిక కమీషనర్ B. S. M వలి శుక్రవారం తెలిపారు. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులు 60 ఏళ్లు నిండిన తర్వాత జీవితాంతం ప్రతి నెలా రూ. 3,000 పెన్షన్ పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గలవారు కార్మిక శాఖ కార్యాలయం, మీ-సేవా కేంద్రంలో సంప్రదించి పథకాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.

సంబంధిత పోస్ట్