మన బాధ్యత ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు గారా అజయ్ కుమార్ బెట్టింగ్ ఆడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్స్ కారణంగా చాలామంది అప్పుల పాలవుతున్నారని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. IPL ప్రారంభం కావడంతో బెట్టింగ్ విచ్చలవిడిగా జరిగే అవకాశం ఉందని, యువత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, అత్యాశకు పోకుండా ఉండాలని పేర్కొన్నారు. బెట్టింగ్ ద్వారా నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారో నిరంతరం పరిశీలించాలని సూచించారు.