రాజమండ్రి దేవీ చౌక్ లో భక్తులను అపరిచితులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు బుధవారం ఆరోపించారు. నగరంలోని రద్దీగా ఉండే దేవిచౌక్ ప్రాంతంలో, దేవాలయం వద్ద వాహనాల పూజల సమయంలో హిజ్రాలు అసభ్యంగా ప్రవర్తిస్తూ, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదులు అందాయని తెలిపారు. అక్రమ వసూళ్లకు పాల్పడితే ఎమర్జెన్సీ నెంబర్ 112 లేదా 3వ పట్టణ పోలీస్ స్టేషన్ కు ph: 9154875125 నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.