టిడిపి నాయకులతో మజ్జి రాంబాబు భేటీ

2536చూసినవారు
టిడిపి నాయకులతో మజ్జి రాంబాబు భేటీ
రాజమహేంద్రవరం 34వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులను నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా పోటీ చేయనున్న తన అభ్యర్థిత్వాన్ని కమిటీ సభ్యులకు తెలియజేశారు. పార్టీ బలోపేతం, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ, స్థానిక రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై కమిటీ సభ్యులతో ఆయన చర్చించారు. మేయర్ అభ్యర్థిత్వానికి తమ సంపూర్ణ మద్దతు అందించి, ఆశీర్వదించాలని కమిటీ సభ్యులను మజ్జి రాంబాబు కోరారు.

సంబంధిత పోస్ట్