365 రోజుల పాటూ రక్తదాన అవగాహన కార్యక్రమం-జూలై -1 నుండి మొదలు

1125చూసినవారు
365 రోజుల పాటూ రక్తదాన అవగాహన కార్యక్రమం-జూలై -1 నుండి మొదలు
మన బాధ్యత ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు గారా అజయ్ కుమార్ ఒక ప్రకటనలో, జూలై 1 నుండి '365 బ్లడ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్' ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందాలనే ఉద్దేశ్యంతో, ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పించి, అందరినీ రక్తదానం చేసేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. రాజమండ్రి సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్‌లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రక్తదాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్