భోజనాలు వడ్డించిన మంత్రి కందుల

1చూసినవారు
రాజమహేంద్రవరంలోని మంజీరా హోటల్లో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.
రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఈ సందర్భంగా మంత్రి సత్కరించారు. అనంతరం స్వయంగా వారికి భోజనం వడ్డించి తన ఆప్యాయతను చాటుకున్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ప్రచారాన్ని మంత్రి అభినందించారు.

సంబంధిత పోస్ట్