రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు అందేలా ప్రజా దర్బార్ ద్వారా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాజమండ్రిలోని 1వ, 2వ డివిజన్లలో "మన వార్డులో - మన ఆదిరెడ్డి" పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గత ఐదేళ్లలో
వైసీపీ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజమహేంద్రవరం నియోజకవర్గంలో సుమారు 8 వేల రైస్ కార్డులు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు.