విద్యార్థులకు కళ్ళజోళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి

358చూసినవారు
విద్యార్థులకు కళ్ళజోళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి
రాజమండ్రిలోని SKVT ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి జాతీయ అంధత్వ నివారణ సంస్థ సహకారంతో బుధవారం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా కళ్ల జోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కళ్ల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

సంబంధిత పోస్ట్