రాజమండ్రి నగరంలో గురువారం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 40వ డివిజన్ బోడపాటి వారి వీధిలో రూ. 8.00 లక్షల నిధులతో చేపట్టనున్న 450 ఎం.ఎం. సి.సి డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా, కూటమి ప్రభుత్వ మార్గనిర్దేశంలో రాజమండ్రి సిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.