భువనేశ్వర్ చేరిన ఎంపీ పురందేశ్వరి, పార్టీ నేతలతో చర్చలు

3చూసినవారు
భువనేశ్వర్ చేరిన ఎంపీ పురందేశ్వరి, పార్టీ నేతలతో చర్చలు
ఒడిశా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శనివారం భువనేశ్వర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ తో పాటు పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ పదాధికారులు, కార్యకర్తలను ఆమె కలుసుకున్నారు. భువనేశ్వర్ లో పురందేశ్వరికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం పార్టీకి సంబంధించిన పలు అంశాలపై నాయకులతో చర్చించారు.

సంబంధిత పోస్ట్