భవన నిర్మాణాలకు నగరపాలక సంస్థ అనుమతి తప్పనిసరి

557చూసినవారు
భవన నిర్మాణాలకు నగరపాలక సంస్థ అనుమతి తప్పనిసరి
రాజమండ్రిలో చేపట్టనున్న భవన నిర్మాణాలకు నగరపాలక సంస్థ అనుమతి తప్పనిసరిగా పొందాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. గురువారం టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి గాదాలమ్మ నగర్, తారకరామ నగర్ ప్రాంతాల్లో భవన ప్లాన్లను పరిశీలించారు. అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణం జరిగితేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరు చేస్తామని, అనుమతి లేకుండా నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్