కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త 4 లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ కార్మికులు పాల్గొనాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, బడా పారిశ్రామికవేత్తలకు కార్మికుల శ్రమను దోచి పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని ఆరోపించారు.