బత్తుల ప్రవీణ్ కుమార్ కు జాతీయ ఉత్తమ సేవా రత్న అవార్డు

108చూసినవారు
రామచంద్రపురం: మన బాధ్యత ఫౌండేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు బత్తుల ప్రవీణ్ కుమార్ కు, సమాజ సేవలో నిస్వార్థ సేవలకు గాను, తిరుపతికి చెందిన శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ వారు శుక్రవారం తిరుపతిలో జాతీయ ఉత్తమ సేవా రత్న అవార్డును అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఫౌండేషన్ ద్వారా రక్తదానం, పర్యావరణ పరిరక్షణ, రోడ్డు భద్రత, విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, పేదలకు సహాయం వంటి కార్యక్రమాలు చేస్తున్నామని, ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని, ప్రజల సహకారం కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్