రాజమండ్రి ఆర్టిసి కాంప్లెక్స్ సమీపంలో శ్రీ శ్రీ శ్రీ పాత సోమాలమ్మ వారి జాతర మహోత్సవములు ఫిబ్రవరి 26, 2026 నుంచి మార్చి 2, 2026 వరకు జరగనున్నాయి. గ్రామ దేవత కావడంతో నగరం నలుమూలల నుంచి భారీగా భక్తులు హాజరవుతారని 12వ వార్డు మాజీ కార్పొరేటర్, ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ తెలిపారు. ప్రతి ఏటా జరిగే జాతరకి భక్తుల రద్దీ దృష్ట్యా తగిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఆయన వెల్లడించారు.