రాజమండ్రి సిటీలో మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన స్ఫూర్తిదాయక సమ్మర్ బ్లడ్ డ్రైవ్ మంగళవారంతో విజయవంతంగా ముగిసింది. మార్చి 7 నుండి జూన్ 30 వరకు 116 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో రక్తదానం యొక్క ఆవశ్యకతపై లక్షలాది మందికి అవగాహన కల్పించారు. ఫౌండేషన్ అధ్యక్షురాలు గారా శ్రీవిద్య రాణి రక్తదాతలను, మద్దతుగా నిలిచిన వారిని అభినందించి, ధన్యవాదాలు తెలిపారు. రక్తదానంపై నిరంతరం కృషి చేస్తామని ఆమె తెలిపారు.