పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో పోలీసులు స్పష్టత ఇవ్వాలి.. జీవీ హర్ష కుమార్

794చూసినవారు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో పోలీసులు స్పష్టత ఇవ్వాలి..  జీవీ హర్ష కుమార్
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో 11 నెలలు గడిచినా పోలీసులు స్పష్టమైన నిర్ధారణ చేయలేదని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ విమర్శించారు. రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటనను హత్యగా కాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోస్టుమార్టం నివేదికలో మృతదేహంపై అనేక గాయాలున్నాయని, నివేదికను పూర్తిగా బయటపెడితే హత్య అంశం బయటపడుతుందని ఆయన అన్నారు. కేసు కౌంటర్ రిపోర్ట్‌ను కోర్టులో దాఖలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్