రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి తొర్రెడులో యువగళం టీం ఆధ్వర్యంలో రోడ్ సెంటర్ డివైడర్లపై మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. యువగళం సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.