ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని కాపాడిన పోలీసులు

1493చూసినవారు
ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని కాపాడిన పోలీసులు
ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని పోలీసులు కాపాడారు. రాజమహేంద్రవరంకు చెందిన విద్యార్థి ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ శుక్రవారం రాత్రి వీడియో చిత్రీకరించి స్నేహితుడికి పంపాడు. రోడ్డు కం రైలు వంతెన 13వ స్తంభం వద్దకు చేరుకొని గోదావరిలోకి దూకాడు. అతని స్నేహితుడు 112 నంబరుకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని గజ ఈతగాడితో బోటు ద్వారా గోదావరిలో మునిగిపోతున్న విద్యార్థిని కాపాడారు.

సంబంధిత పోస్ట్