రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ సంయుక్తంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం రాజమహేంద్రవరం గ్రామీణ మండలం తొర్రెడులో జరిగింది. స్థానిక విలేజ్ క్లినిక్ లో వైద్యాధికారి ఎల్. కెజియా 5 సంవత్సరాల లోపు చిన్నారులందరికి పోలియో చుక్కలు వేశారు. అవసరమైన వారికి మందులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది వై. మణి, ఎం.వసంత లక్ష్మి, కె.కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.