రాజమండ్రికి చెందిన ప్రముఖ కార్టూనిస్టు శేఖర్, హైదరాబాద్ లో నిన్న జరిగిన కార్యక్రమంలో ఉత్తమ కార్టూనిస్ట్ -2026 పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ రచయిత పి. చంద్రశేఖర ఆజాద్, కవి సాధనాల వెంకట స్వామి నాయుడు, చతుర, విపుల పూర్వ సంపాదకులు చంద్ర ప్రతాప్ కంతేటి చేతుల మీదుగా ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి నగరవాసులు సోమవారం శేఖర్ కు అభినందనలు తెలిపారు.