ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్సీ సోము వీర్రాజు శుక్రవారం ఉదయం కలిసి రాష్ట్రంలో “CTR JK Tyre FMSCI ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్–2026” పోటీలను నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక కార్ రేసింగ్ పోటీలను ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం ద్వారా రాష్ట్రాన్ని అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ , టూరిజం డెస్టినేషన్ గా అభివృద్ధి చేయవచ్చని సోము వీర్రాజు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే ఈ పోటీల ద్వారా యువతకు మోటార్ స్పోర్ట్స్ రంగంలో విస్తృత అవకాశాలు లభిస్తాయని తెలిపారు.