రాజమండ్రిలోని 16వ వార్డులో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. వార్డులోని డ్రైనేజీ, పారిశుధ్యం, మౌలిక వసతుల సమస్యలను స్థానిక నాయకులు అడపా వరప్రసాద్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ ప్రతి సమస్యను పరిశీలించి, తక్షణమే పారిశుధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వార్డు అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.