రాజమండ్రిలోని గోదావరి రైల్వే స్టేషన్ వద్ద శనివారం, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి ఆటో డ్రైవర్ యూనియన్, అండర్ గ్రౌండ్ క్లాత్ వర్తక సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను వారికి వివరించారు. దళారీ వ్యవస్థ లేకుండా 'ముద్ర లోన్' ద్వారా లబ్ధి పొందిన ఆటో డ్రైవర్లు, వర్తక సంఘం సభ్యులు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.