అరుణాచల యాత్రకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

2చూసినవారు
అరుణాచల యాత్రకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
తమిళనాడు తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 12 నుంచి 28 వరకు జరగనున్న కార్తికేయ మహాదీపం ఉత్సవానికి తూ. గో. జిల్లా నుంచి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డి. పి. టి. వో మనోహర్ తెలిపారు. జిల్లాలోని 4 డిపోల నుంచి తిరువణ్ణామలైకు ఈ బస్సులు నడుస్తాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే నవంబర్ 22 నుంచి 25 వరకు డిమాండ్ కు అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని డి. పి. టి. వో తెలిపారు.

సంబంధిత పోస్ట్