ఎస్పీ మండపేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

2చూసినవారు
ఎస్పీ మండపేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ సోమవారం మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, రిసెప్షన్ హెల్ప్ డెస్క్, సీసీ కెమెరాల పనితీరును ఆయన పరిశీలించారు. ఎన్డీపీఎస్, పోక్సో, రేప్ వంటి తీవ్రమైన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, త్వరితగతిన చార్జిషీట్లు దాఖలు చేయాలని, పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించి, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్