విద్యుత్ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

1367చూసినవారు
తూ. గో జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రికి విచ్చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లాలో అమలవుతున్న విద్యుత్ కార్యక్రమాలపై సమీక్షించారు. 2027 మహా గోదావరి పుష్కరాల నేపథ్యంలో విద్యుత్ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో, ఏపీ ఈపిడిసిఎల్ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్