రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం నగరంలోని 36, 38, 39 డివిజన్లలో పారిశుద్ధ్య పరిస్థితులను సమీక్షించారు. పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని నగర పాలక సంస్థ ఆరోగ్య విభాగం అధికారులకు, సిబ్బందికి సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, సరైన ప్రణాళికతో అన్ని కాలనీల్లో రోటేషన్ విధానంలో నిర్వహించాలని ఆయన ఆదేశించారు.