ఏపీ షెడ్యూల్డ్ తెగల (ST) కమిషన్ గౌరవ సభ్యులు కె. మల్లేశ్వరరావు, కె. లక్ష్మి శనివారం రాజమండ్రిలోని కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. కారాగార పర్యవేక్షణాధికారి వారికి స్వాగతం పలికి, కారాగారంలోని వివిధ విభాగాల గురించి వివరించారు. ఖైదీలకు అందుతున్న వైద్య సేవలు, ఆహార సదుపాయాలను పరిశీలించి, అత్యవసర సమయాల్లో తీసుకుంటున్న జాగ్రత్తల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.