ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15, 2025న ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం అమలులోకి వచ్చి 225 రోజులు పూర్తయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 4 డిపోల నుండి మొత్తం 2.89 కోట్ల మంది ప్రయాణించగా, వీరిలో 1.95 కోట్ల మంది మహిళలే, అంటే 68% మంది మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. రాజమహేంద్రవరం డిపో నుండి 70.07 లక్షలు, కొవ్వూరు డిపో నుండి 39.41 లక్షలు, గోకవరం డిపో నుండి 54.31 లక్షలు, నిడదవోలు డిపో నుండి 32.03 లక్షల మంది మహిళలు ప్రయాణించినట్లు తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ Y.S.N. మూర్తి తెలిపారు. ఈ పథకం విజయవంతంగా అమలు అవుతోందని ఆయన పేర్కొన్నారు.