రాజమండ్రిలోని మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో సీఐ మంగాదేవి, ఎస్సై అమీన, శక్తి యూనిట్ టీమ్-1 ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, ట్రాఫిక్ నియమాలు, సోషల్ మీడియా మోసాలు, బెట్టింగ్ గేమ్స్, మత్తు పదార్థాల వినియోగం, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కల్పించారు. అజ్ఞాత లింకులను క్లిక్ చేయవద్దని, ఆన్‌లైన్ మోసాలను నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శక్తి యాప్ వినియోగం, డౌన్‌లోడ్ విధానం గురించి వివరించారు.