కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి సిటీలో నిర్వహిస్తున్న సేవా ఫస్ట్ ఇన్నో్వేషన్ ఛాలెంజ్లో
విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సృజనాత్మక ఆలోచనలను వినూత్న ఆవిష్కరణలుగా మార్చుకోవాలని శనివారం నిర్వాహకులు పిలుపునిచ్చారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతికతతో కూడిన పరిష్కారాలను రూపొందించే యువతను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమం యువత తమ ఆలోచనలు, సృజనాత్మకతను ప్రదర్శించేందుకు మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమ ఇన్చార్జ్ కె. వి. ఉన్నికృష్ణ, కన్వీనర్ క్షత్రియ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.