మన బాధ్యత ఫౌండేషన్ రాజమండ్రి సిటీ అధ్యక్షురాలు గారా శ్రీవిద్య రాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ బ్లడ్ డ్రైవ్ మంగళవారం నాటికి 25వ రోజుకు చేరుకుంది. వేసవిలో 2000 మంది చేత రక్తదానం చేయించి, రక్త కొరత లేకుండా చేసి, ఆపదలో ఉన్న వారి ప్రాణాలు రక్షించడమే లక్ష్యమని ఆమె తెలిపారు. ప్రజల సహకారం ఉంటే ఆ లక్ష్యం నెరవేరుతుందని ఆమె అన్నారు.