తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి నుంచి కాశీ, అయోధ్య పుణ్యక్షేత్రాల సందర్శన కోసం గురువారం నుండి సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ మాధవ్ తెలిపారు. 11 రోజుల పాటు సాగే ఈ యాత్రలో భువనేశ్వర్, పూరి, కోణార్క్, అయోధ్య, బుద్ధగయ, అరసవెల్లి, శ్రీ కుర్మం, అన్నవరం సహా 13 ఆలయాలను సందర్శించవచ్చు. టికెట్ ధర రూ.13,000గా నిర్ణయించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.