ప్రధాని నరేంద్ర
మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రి కోటిలింగాల ఘాట్ వద్ద మంగళవారం స్వచ్ఛ
భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల అధ్యక్షుడు నందివాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పరిసరాలను శుభ్రం చేసి, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 'సేవా సంకల్ప అభియాన్ – సేవలో నా భాగస్వామ్యం'లో భాగంగా జరిగింది.