యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని

464చూసినవారు
యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 నిర్వహణలో భాగంగా జూన్ 14న రాజమండ్రిలోని గౌతమి ఘాట్ వద్ద నిర్వహించనున్న జిల్లా స్థాయి యోగా సాధన కార్యక్రమానికి సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. భాస్కర్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బందితో సమావేశమయ్యారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్