రాజమండ్రి నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పలుచోట్ల గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలలో ద్విచక్ర వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వాహనదారుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న చలానాల వివరాలను కూడా తనిఖీ చేసి, వెంటనే చెల్లించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, పత్రాలు సక్రమంగా ఉంచుకోవడం వంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.