రాజమండ్రిలో గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

569చూసినవారు
రాజమండ్రిలో గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
మంగళవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో రాజమహేంద్రవరం గోదావరి బండ సమీపంలోని ధోబి ఘాట్ వద్ద గోదావరి నదిలో తేలుతూ కనిపించిన గుర్తుతెలియని పురుషుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడు వయస్సు 45 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా. మృతదేహంపై గ్రీన్ కలర్ టీ షర్ట్, గల్ల లుంగి ధరించి ఉండగా, డైపర్ కూడా ధరించి ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి ఎవరైనా సమాచారం తెలిసిన వారు వెంటనే రెండవ పట్టణ పోలీస్ స్టేషన్, రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్‌ నెంబర్: 9440796576 సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్