రాజమండ్రి రూరల్, తొర్రెడు ఎటిగట్టుపై వెలసిన వేపాలమ్మ తల్లి నూతన ఆలయ పునఃప్రతిష్ఠ ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా 11వ తేదీన హోమ క్రతువులు, విశేష పూజలు, 12వ తేదీన ఆదివారం ఉదయం 7.09 గంటలకు అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ జరగనుంది. అనంతరం అఖండ అన్న సమారాధన జరుగుతుందని ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు.